# fr/French.xml.gz
# te/Telugu.xml.gz


(src)="b.GEN.1.1.1"> Au commencement , Dieu créa les cieux et la terre .
(trg)="b.GEN.1.1.1"> ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను .

(src)="b.GEN.1.2.1"> La terre était informe et vide : il y avait des ténèbres à la surface de l`abîme , et l`esprit de Dieu se mouvait au-dessus des eaux .
(trg)="b.GEN.1.2.1"> భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను ; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను .

(src)="b.GEN.1.3.1"> Dieu dit : Que la lumière soit !
(src)="b.GEN.1.3.2"> Et la lumière fut .
(trg)="b.GEN.1.3.1"> దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను .

(src)="b.GEN.1.4.1"> Dieu vit que la lumière était bonne ; et Dieu sépara la lumière d`avec les ténèbres .
(trg)="b.GEN.1.4.1"> వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను ; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను .

(src)="b.GEN.1.5.1"> Dieu appela la lumière jour , et il appela les ténèbres nuit .
(src)="b.GEN.1.5.2"> Ainsi , il y eut un soir , et il y eut un matin : ce fut le premier jour .
(trg)="b.GEN.1.5.1"> దేవుడు వెలుగునకు పగలనియు , చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను . అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను .

(src)="b.GEN.1.6.1"> Dieu dit : Qu`il y ait une étendue entre les eaux , et qu`elle sépare les eaux d`avec les eaux .
(trg)="b.GEN.1.6.1"> మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను .

(src)="b.GEN.1.7.1"> Et Dieu fit l`étendue , et il sépara les eaux qui sont au-dessous de l`étendue d`avec les eaux qui sont au-dessus de l`étendue .
(src)="b.GEN.1.7.2"> Et cela fut ainsi .
(trg)="b.GEN.1.7.1"> దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను .

(src)="b.GEN.1.8.1"> Dieu appela l`étendue ciel .
(src)="b.GEN.1.8.2"> Ainsi , il y eut un soir , et il y eut un matin : ce fut le second jour .
(trg)="b.GEN.1.8.1"> దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను . అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను .

(src)="b.GEN.1.9.1"> Dieu dit : Que les eaux qui sont au-dessous du ciel se rassemblent en un seul lieu , et que le sec paraisse .
(src)="b.GEN.1.9.2"> Et cela fut ainsi .
(trg)="b.GEN.1.9.1"> దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను .

(src)="b.GEN.1.10.1"> Dieu appela le sec terre , et il appela l`amas des eaux mers .
(src)="b.GEN.1.10.2"> Dieu vit que cela était bon .
(trg)="b.GEN.1.10.1"> దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను , జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను , అది మంచిదని దేవుడు చూచెను .

(src)="b.GEN.1.11.1"> Puis Dieu dit : Que la terre produise de la verdure , de l`herbe portant de la semence , des arbres fruitiers donnant du fruit selon leur espèce et ayant en eux leur semence sur la terre .
(src)="b.GEN.1.11.2"> Et cela fut ainsi .
(trg)="b.GEN.1.11.1"> దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను .

(src)="b.GEN.1.12.1"> La terre produisit de la verdure , de l`herbe portant de la semence selon son espèce , et des arbres donnant du fruit et ayant en eux leur semence selon leur espèce .
(src)="b.GEN.1.12.2"> Dieu vit que cela était bon .
(trg)="b.GEN.1.12.1"> భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను , తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను

(src)="b.GEN.1.13.1"> Ainsi , il y eut un soir , et il y eut un matin : ce fut le troisième jour .
(trg)="b.GEN.1.13.1"> అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను .

(src)="b.GEN.1.14.1"> Dieu dit : Qu`il y ait des luminaires dans l`étendue du ciel , pour séparer le jour d`avec la nuit ; que ce soient des signes pour marquer les époques , les jours et les années ;
(trg)="b.GEN.1.14.1"> దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు , అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు ,

(src)="b.GEN.1.15.1"> et qu`ils servent de luminaires dans l`étendue du ciel , pour éclairer la terre .
(src)="b.GEN.1.15.2"> Et cela fut ainsi .
(trg)="b.GEN.1.15.1"> భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను ; ఆ ప్రకారమాయెను .

(src)="b.GEN.1.16.1"> Dieu fit les deux grands luminaires , le plus grand luminaire pour présider au jour , et le plus petit luminaire pour présider à la nuit ; il fit aussi les étoiles .
(trg)="b.GEN.1.16.1"> దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను , అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను .

(src)="b.GEN.1.17.1"> Dieu les plaça dans l`étendue du ciel , pour éclairer la terre ,
(trg)="b.GEN.1.17.1"> భూమిమీద వెలు గిచ్చుటకును

(src)="b.GEN.1.18.1"> pour présider au jour et à la nuit , et pour séparer la lumière d`avec les ténèbres .
(src)="b.GEN.1.18.2"> Dieu vit que cela était bon .
(trg)="b.GEN.1.18.1"> పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను ; అది మంచిదని దేవుడు చూచెను .

(src)="b.GEN.1.19.1"> Ainsi , il y eut un soir , et il y eut un matin : ce fut le quatrième jour .
(trg)="b.GEN.1.19.1"> అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను .

(src)="b.GEN.1.20.1"> Dieu dit : Que les eaux produisent en abondance des animaux vivants , et que des oiseaux volent sur la terre vers l`étendue du ciel .
(trg)="b.GEN.1.20.1"> దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు , పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను .

(src)="b.GEN.1.21.1"> Dieu créa les grands poissons et tous les animaux vivants qui se meuvent , et que les eaux produisirent en abondance selon leur espèce ; il créa aussi tout oiseau ailé selon son espèce .
(src)="b.GEN.1.21.2"> Dieu vit que cela était bon .
(trg)="b.GEN.1.21.1"> దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను , జీవముకలిగి చలించు వాటినన్నిటిని , దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను . అది మంచిదని దేవుడు చూచెను .

(src)="b.GEN.1.22.1"> Dieu les bénit , en disant : Soyez féconds , multipliez , et remplissez les eaux des mers ; et que les oiseaux multiplient sur la terre .
(trg)="b.GEN.1.22.1"> దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు , పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు , వాటిని ఆశీర్వ దించెను .

(src)="b.GEN.1.23.1"> Ainsi , il y eut un soir , et il y eut un matin : ce fut le cinquième jour .
(trg)="b.GEN.1.23.1"> అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను .

(src)="b.GEN.1.24.1"> Dieu dit : Que la terre produise des animaux vivants selon leur espèce , du bétail , des reptiles et des animaux terrestres , selon leur espèce .
(src)="b.GEN.1.24.2"> Et cela fut ainsi .
(trg)="b.GEN.1.24.1"> దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని , అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను ; ఆప్రకారమాయెను .

(src)="b.GEN.1.25.1"> Dieu fit les animaux de la terre selon leur espèce , le bétail selon son espèce , et tous les reptiles de la terre selon leur espèce .
(src)="b.GEN.1.25.2"> Dieu vit que cela était bon .
(trg)="b.GEN.1.25.1"> దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను , ఆ యా జాతుల ప్రకారము పశువులను , ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను . అదిమంచిదని దేవుడు చూచెను .

(src)="b.GEN.1.26.1"> Puis Dieu dit : Faisons l`homme à notre image , selon notre ressemblance , et qu`il domine sur les poissons de la mer , sur les oiseaux du ciel , sur le bétail , sur toute la terre , et sur tous les reptiles qui rampent sur la terre .
(trg)="b.GEN.1.26.1"> దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము ; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను .

(src)="b.GEN.1.27.1"> Dieu créa l`homme à son image , il le créa à l`image de Dieu , il créa l`homme et la femme .
(trg)="b.GEN.1.27.1"> దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను ; దేవుని స్వరూపమందు వాని సృజించెను ; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను .

(src)="b.GEN.1.28.1"> Dieu les bénit , et Dieu leur dit : Soyez féconds , multipliez , remplissez la terre , et l`assujettissez ; et dominez sur les poissons de la mer , sur les oiseaux du ciel , et sur tout animal qui se meut sur la terre .
(trg)="b.GEN.1.28.1"> దేవుడు వారిని ఆశీర్వ దించెను ; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి ; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను .

(src)="b.GEN.1.29.1"> Et Dieu dit : Voici , je vous donne toute herbe portant de la semence et qui est à la surface de toute la terre , et tout arbre ayant en lui du fruit d`arbre et portant de la semence : ce sera votre nourriture .
(trg)="b.GEN.1.29.1"> దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను ; అవి మీ కాహారమగును .

(src)="b.GEN.1.30.1"> Et à tout animal de la terre , à tout oiseau du ciel , et à tout ce qui se meut sur la terre , ayant en soi un souffle de vie , je donne toute herbe verte pour nourriture .
(src)="b.GEN.1.30.2"> Et cela fut ainsi .
(trg)="b.GEN.1.30.1"> భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను . ఆ ప్రకారమాయెను .

(src)="b.GEN.1.31.1"> Dieu vit tout ce qu`il avait fait et voici , cela était très bon .
(src)="b.GEN.1.31.2"> Ainsi , il y eut un soir , et il y eut un matin : ce fut le sixième jour .
(trg)="b.GEN.1.31.1"> దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను . అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను .

(src)="b.GEN.2.1.1"> Ainsi furent achevés les cieux et la terre , et toute leur armée .
(trg)="b.GEN.2.1.1"> ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూ హమును సంపూర్తి చేయబడెను .

(src)="b.GEN.2.2.1"> Dieu acheva au septième jour son oeuvre , qu`il avait faite : et il se reposa au septième jour de toute son oeuvre , qu`il avait faite .
(trg)="b.GEN.2.2.1"> దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి , తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను .

(src)="b.GEN.2.3.1"> Dieu bénit le septième jour , et il le sanctifia , parce qu`en ce jour il se reposa de toute son oeuvre qu`il avait créée en la faisant .
(trg)="b.GEN.2.3.1"> కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు , సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను .

(src)="b.GEN.2.4.1"> Voici les origines des cieux et de la terre , quand ils furent créés .
(trg)="b.GEN.2.4.1"> దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే .

(src)="b.GEN.2.5.1"> Lorsque l`Éternel Dieu fit une terre et des cieux , aucun arbuste des champs n`était encore sur la terre , et aucune herbe des champs ne germait encore : car l`Éternel Dieu n`avait pas fait pleuvoir sur la terre , et il n`y avait point d`homme pour cultiver le sol .
(trg)="b.GEN.2.5.1"> అదివరకు పొలమందలియే పొదయు భూమిమీద నుండలేదు . పొలమందలి యే చెట్టును మొలవలేదు ; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు , నేలను సేద్యపరచుటక

(src)="b.GEN.2.6.1"> Mais une vapeur s`éleva de la terre , et arrosa toute la surface du sol .
(trg)="b.GEN.2.6.1"> అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంత టిని తడిపెను .

(src)="b.GEN.2.7.1"> L`Éternel Dieu forma l`homme de la poussière de la terre , il souffla dans ses narines un souffle de vie et l`homme devint un être vivant .
(trg)="b.GEN.2.7.1"> దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను .

(src)="b.GEN.2.8.1"> Puis l`Éternel Dieu planta un jardin en Éden , du côté de l`orient , et il y mit l`homme qu`il avait formé .
(trg)="b.GEN.2.8.1"> దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను .

(src)="b.GEN.2.9.1"> L`Éternel Dieu fit pousser du sol des arbres de toute espèce , agréables à voir et bons à manger , et l`arbre de la vie au milieu du jardin , et l`arbre de la connaissance du bien et du mal .
(trg)="b.GEN.2.9.1"> మరియు దేవుడైన యెహోవా చూపు నకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును , ఆ తోటమధ్యను జీవవృక్షమును , మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను .

(src)="b.GEN.2.10.1"> Un fleuve sortait d`Éden pour arroser le jardin , et de là il se divisait en quatre bras .
(trg)="b.GEN.2.10.1"> మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను .

(src)="b.GEN.2.11.1"> Le nom du premier est Pischon ; c`est celui qui entoure tout le pays de Havila , où se trouve l`or .
(trg)="b.GEN.2.11.1"> మొదటిదాని పేరు పీషోను ; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది ; అక్కడ బంగారమున్నది .

(src)="b.GEN.2.12.1"> L`or de ce pays est pur ; on y trouve aussi le bdellium et la pierre d`onyx .
(trg)="b.GEN.2.12.1"> ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది ; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును .

(src)="b.GEN.2.13.1"> Le nom du second fleuve est Guihon ; c`est celui qui entoure tout le pays de Cusch .
(trg)="b.GEN.2.13.1"> రెండవ నది పేరు గీహోను ; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది .

(src)="b.GEN.2.14.1"> Le nom du troisième est Hiddékel ; c`est celui qui coule à l`orient de l`Assyrie .
(src)="b.GEN.2.14.2"> Le quatrième fleuve , c`est l`Euphrate .
(trg)="b.GEN.2.14.1"> మూడవ నది పేరు హిద్దెకెలు ; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది . నాలుగవ నది యూఫ్రటీసు

(src)="b.GEN.2.15.1"> L`Éternel Dieu prit l`homme , et le plaça dans le jardin d`Éden pour le cultiver et pour le garder .
(trg)="b.GEN.2.15.1"> మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను .

(src)="b.GEN.2.16.1"> L`Éternel Dieu donna cet ordre à l`homme : Tu pourras manger de tous les arbres du jardin ;
(trg)="b.GEN.2.16.1"> మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును ;

(src)="b.GEN.2.17.1"> mais tu ne mangeras pas de l`arbre de la connaissance du bien et du mal , car le jour où tu en mangeras , tu mourras .
(trg)="b.GEN.2.17.1"> అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు ; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను .

(src)="b.GEN.2.18.1"> L`Éternel Dieu dit : Il n`est pas bon que l`homme soit seul ; je lui ferai une aide semblable à lui .
(trg)="b.GEN.2.18.1"> మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు ; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను .

(src)="b.GEN.2.19.1"> L`Éternel Dieu forma de la terre tous les animaux des champs et tous les oiseaux du ciel , et il les fit venir vers l`homme , pour voir comment il les appellerait , et afin que tout être vivant portât le nom que lui donnerait l`homme .
(trg)="b.GEN.2.19.1"> దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి , ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను . జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను .

(src)="b.GEN.2.20.1"> Et l`homme donna des noms à tout le bétail , aux oiseaux du ciel et à tous les animaux des champs ; mais , pour l`homme , il ne trouva point d`aide semblable à lui .
(trg)="b.GEN.2.20.1"> అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను . అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను .

(src)="b.GEN.2.21.1"> Alors l`Éternel Dieu fit tomber un profond sommeil sur l`homme , qui s`endormit ; il prit une de ses côtes , et referma la chair à sa place .
(trg)="b.GEN.2.21.1"> అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను .

(src)="b.GEN.2.22.1"> L`Éternel Dieu forma une femme de la côte qu`il avait prise de l`homme , et il l`amena vers l`homme .
(trg)="b.GEN.2.22.1"> తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను .

(src)="b.GEN.2.23.1"> Et l`homme dit : Voici cette fois celle qui est os de mes os et chair de ma chair ! on l`appellera femme , parce qu`elle a été prise de l`homme .
(trg)="b.GEN.2.23.1"> అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అన బడును .

(src)="b.GEN.2.24.1"> C`est pourquoi l`homme quittera son père et sa mère , et s`attachera à sa femme , et ils deviendront une seule chair .
(trg)="b.GEN.2.24.1"> కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును ; వారు ఏక శరీరమైయుందురు .

(src)="b.GEN.2.25.1"> L`homme et sa femme étaient tous deux nus , et ils n`en avaient point honte .
(trg)="b.GEN.2.25.1"> అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగం బరులుగా నుండిరి ; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి .

(src)="b.GEN.3.1.1"> Le serpent était le plus rusé de tous les animaux des champs , que l`Éternel Dieu avait faits .
(src)="b.GEN.3.1.2"> Il dit à la femme : Dieu a -t-il réellement dit : Vous ne mangerez pas de tous les arbres du jardin ?
(trg)="b.GEN.3.1.1"> దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను . అది ఆ స్త్రీతోఇది నిజమా ? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా ? అని అడి గెను .

(src)="b.GEN.3.2.1"> La femme répondit au serpent : Nous mangeons du fruit des arbres du jardin .
(trg)="b.GEN.3.2.1"> అందుకు స్త్రీఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును ;

(src)="b.GEN.3.3.1"> Mais quant au fruit de l`arbre qui est au milieu du jardin , Dieu a dit : Vous n`en mangerez point et vous n`y toucherez point , de peur que vous ne mouriez .
(trg)="b.GEN.3.3.1"> అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలము లనుగూర్చి దేవుడుమీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు , వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్ప ముతో అనెను .

(src)="b.GEN.3.4.1"> Alors le serpent dit à la femme : Vous ne mourrez point ;
(trg)="b.GEN.3.4.1"> అందుకు సర్పముమీరు చావనే చావరు ;

(src)="b.GEN.3.5.1"> mais Dieu sait que , le jour où vous en mangerez , vos yeux s`ouvriront , et que vous serez comme des dieux , connaissant le bien et le mal .
(trg)="b.GEN.3.5.1"> ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు , మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా

(src)="b.GEN.3.6.1"> La femme vit que l`arbre était bon à manger et agréable à la vue , et qu`il était précieux pour ouvrir l`intelligence ; elle prit de son fruit , et en mangea ; elle en donna aussi à son mari , qui était auprès d`elle , et il en mangea .
(trg)="b.GEN.3.6.1"> స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచి దియు , కన్నులకు అందమైనదియు , వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను , అతడుకూడ తినెను ;

(src)="b.GEN.3.7.1"> Les yeux de l`un et de l`autre s`ouvrirent , ils connurent qu`ils étaient nus , et ayant cousu des feuilles de figuier , ils s`en firent des ceintures .
(trg)="b.GEN.3.7.1"> అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను ; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి .

(src)="b.GEN.3.8.1"> Alors ils entendirent la voix de l`Éternel Dieu , qui parcourait le jardin vers le soir , et l`homme et sa femme se cachèrent loin de la face de l`Éternel Dieu , au milieu des arbres du jardin .
(trg)="b.GEN.3.8.1"> చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచ రించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని , దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగు కొనగా

(src)="b.GEN.3.9.1"> Mais l`Éternel Dieu appela l`homme , et lui dit : Où es -tu ?
(trg)="b.GEN.3.9.1"> దేవుడైన యెహోవా ఆదామును పిలిచినీవు ఎక్కడ ఉన్నావనెను .

(src)="b.GEN.3.10.1"> Il répondit : J`ai entendu ta voix dans le jardin , et j`ai eu peur , parce que je suis nu , et je me suis caché .
(trg)="b.GEN.3.10.1"> అందు కతడునేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయ పడి దాగుకొంటిననెను .

(src)="b.GEN.3.11.1"> Et l`Éternel Dieu dit : Qui t`a appris que tu es nu ?
(src)="b.GEN.3.11.2"> Est -ce que tu as mangé de l`arbre dont je t`avais défendu de manger ?
(trg)="b.GEN.3.11.1"> అందుకాయననీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు ? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివా ? అని అడిగెను .

(src)="b.GEN.3.12.1"> L`homme répondit : La femme que tu as mise auprès de moi m`a donné de l`arbre , et j`en ai mangé .
(trg)="b.GEN.3.12.1"> అందుకు ఆదామునాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను .

(src)="b.GEN.3.13.1"> Et l`Éternel Dieu dit à la femme : Pourquoi as -tu fait cela ?
(src)="b.GEN.3.13.2"> La femme répondit : Le serpent m`a séduite , et j`en ai mangé .
(trg)="b.GEN.3.13.1"> అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతోనీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీసర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను .

(src)="b.GEN.3.14.1"> L`Éternel Dieu dit au serpent : Puisque tu as fait cela , tu seras maudit entre tout le bétail et entre tous les animaux des champs , tu marcheras sur ton ventre , et tu mangeras de la poussière tous les jours de ta vie .
(trg)="b.GEN.3.14.1"> అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్ని

(src)="b.GEN.3.15.1"> Je mettrai inimitié entre toi et la femme , entre ta postérité et sa postérité : celle -ci t`écrasera la tête , et tu lui blesseras le talon .
(trg)="b.GEN.3.15.1"> మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను . అది నిన్ను తలమీద కొట్టును ; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను .

(src)="b.GEN.3.16.1"> Il dit à la femme : J`augmenterai la souffrance de tes grossesses , tu enfanteras avec douleur , et tes désirs se porteront vers ton mari , mais il dominera sur toi .
(trg)="b.GEN.3.16.1"> ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను ; వేదనతో పిల్లలను కందువు ; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును ; అతడు నిన్ను ఏలునని చెప్పెను .

(src)="b.GEN.3.17.1"> Il dit à l`homme : Puisque tu as écouté la voix de ta femme , et que tu as mangé de l`arbre au sujet duquel je t`avais donné cet ordre : Tu n`en mangeras point ! le sol sera maudit à cause de toi .
(src)="b.GEN.3.17.2"> C`est à force de peine que tu en tireras ta nourriture tous les jours de ta vie ,
(trg)="b.GEN.3.17.1"> ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు ;

(src)="b.GEN.3.18.1"> il te produira des épines et des ronces , et tu mangeras de l`herbe des champs .
(trg)="b.GEN.3.18.1"> అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును ; పొలములోని పంట తిందువు ;

(src)="b.GEN.3.19.1"> C`est à la sueur de ton visage que tu mangeras du pain , jusqu`à ce que tu retournes dans la terre , d`où tu as été pris ; car tu es poussière , et tu retourneras dans la poussière .
(trg)="b.GEN.3.19.1"> నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ; ఏల యనగా నేలనుండి నీవు తీయబడితివి ; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను .

(src)="b.GEN.3.20.1"> Adam donna à sa femme le nom d`Eve : car elle a été la mère de tous les vivants .
(trg)="b.GEN.3.20.1"> ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను . ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి .

(src)="b.GEN.3.21.1"> L`Éternel Dieu fit à Adam et à sa femme des habits de peau , et il les en revêtit .
(trg)="b.GEN.3.21.1"> దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను .

(src)="b.GEN.3.22.1"> L`Éternel Dieu dit : Voici , l`homme est devenu comme l`un de nous , pour la connaissance du bien et du mal .
(src)="b.GEN.3.22.2"> Empêchons -le maintenant d`avancer sa main , de prendre de l`arbre de vie , d`en manger , et de vivre éternellement .
(trg)="b.GEN.3.22.1"> అప్పుడు దేవుడైన యెహోవాఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు , ఆదాము మనలో ఒకనివంటివాడాయెను . కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతం

(src)="b.GEN.3.23.1"> Et l`Éternel Dieu le chassa du jardin d`Éden , pour qu`il cultivât la terre , d`où il avait été pris .
(trg)="b.GEN.3.23.1"> దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను .

(src)="b.GEN.3.24.1"> C`est ainsi qu`il chassa Adam ; et il mit à l`orient du jardin d`Éden les chérubins qui agitent une épée flamboyante , pour garder le chemin de l`arbre de vie .
(trg)="b.GEN.3.24.1"> అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను , జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను .

(src)="b.GEN.4.1.1"> Adam connut Eve , sa femme ; elle conçut , et enfanta Caïn et elle dit : J`ai formé un homme avec l`aide de l`Éternel .
(trg)="b.GEN.4.1.1"> ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కనియెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను .

(src)="b.GEN.4.2.1"> Elle enfanta encore son frère Abel .
(src)="b.GEN.4.2.2"> Abel fut berger , et Caïn fut laboureur .
(trg)="b.GEN.4.2.1"> తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను . హేబెలు గొఱ్ఱల కాపరి ; కయీను భూమిని సేద్యపరచువాడు .

(src)="b.GEN.4.3.1"> Au bout de quelque temps , Caïn fit à l`Éternel une offrande des fruits de la terre ;
(trg)="b.GEN.4.3.1"> కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను .

(src)="b.GEN.4.4.1"> et Abel , de son côté , en fit une des premiers-nés de son troupeau et de leur graisse .
(src)="b.GEN.4.4.2"> L`Éternel porta un regard favorable sur Abel et sur son offrande ;
(trg)="b.GEN.4.4.1"> హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను . యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను ;

(src)="b.GEN.4.5.1"> mais il ne porta pas un regard favorable sur Caïn et sur son offrande .
(src)="b.GEN.4.5.2"> Caïn fut très irrité , et son visage fut abattu .
(trg)="b.GEN.4.5.1"> కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు . కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా

(src)="b.GEN.4.6.1"> Et l`Éternel dit à Caïn : Pourquoi es -tu irrité , et pourquoi ton visage est -il abattu ?
(trg)="b.GEN.4.6.1"> యెహోవా కయీనుతోనీకు కోపమేల ? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి ?

(src)="b.GEN.4.7.1"> Certainement , si tu agis bien , tu relèveras ton visage , et si tu agis mal , le péché se couche à la porte , et ses désirs se portent vers toi : mais toi , domine sur lui .
(trg)="b.GEN.4.7.1"> నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా ? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును ; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను .

(src)="b.GEN.4.8.1"> Cependant , Caïn adressa la parole à son frère Abel ; mais , comme ils étaient dans les champs , Caïn se jeta sur son frère Abel , et le tua .
(trg)="b.GEN.4.8.1"> కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను . వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను .

(src)="b.GEN.4.9.1"> L`Éternel dit à Caïn : Où est ton frère Abel ?
(src)="b.GEN.4.9.2"> Il répondit : Je ne sais pas ; suis -je le gardien de mon frère ?
(trg)="b.GEN.4.9.1"> యెహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను ; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను .

(src)="b.GEN.4.10.1"> Et Dieu dit : Qu`as -tu fait ?
(src)="b.GEN.4.10.2"> La voix du sang de ton frère crie de la terre jusqu`à moi .
(trg)="b.GEN.4.10.1"> అప్పుడాయననీవు చేసినపని యేమిటి ? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది .

(src)="b.GEN.4.11.1"> Maintenant , tu seras maudit de la terre qui a ouvert sa bouche pour recevoir de ta main le sang de ton frère .
(trg)="b.GEN.4.11.1"> కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ , నీవు శపింప బడినవాడవు ;

(src)="b.GEN.4.12.1"> Quand tu cultiveras le sol , il ne te donnera plus sa richesse .
(src)="b.GEN.4.12.2"> Tu seras errant et vagabond sur la terre .
(trg)="b.GEN.4.12.1"> నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు ; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను .

(src)="b.GEN.4.13.1"> Caïn dit à l`Éternel : Mon châtiment est trop grand pour être supporté .
(trg)="b.GEN.4.13.1"> అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది .

(src)="b.GEN.4.14.1"> Voici , tu me chasses aujourd`hui de cette terre ; je serai caché loin de ta face , je serai errant et vagabond sur la terre , et quiconque me trouvera me tuera .
(trg)="b.GEN.4.14.1"> నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి ; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును . కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను .

(src)="b.GEN.4.15.1"> L`Éternel lui dit : Si quelqu`un tuait Caïn , Caïn serait vengé sept fois .
(src)="b.GEN.4.15.2"> Et l`Éternel mit un signe sur Caïn pour que quiconque le trouverait ne le tuât point .
(trg)="b.GEN.4.15.1"> అందుకు యెహోవా అతనితోకాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను . మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండున

(src)="b.GEN.4.16.1"> Puis , Caïn s`éloigna de la face de l`Éternel , et habita dans la terre de Nod , à l`orient d`Éden .
(trg)="b.GEN.4.16.1"> అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను .

(src)="b.GEN.4.17.1"> Caïn connut sa femme ; elle conçut , et enfanta Hénoc .
(src)="b.GEN.4.17.2"> Il bâtit ensuite une ville , et il donna à cette ville le nom de son fils Hénoc .
(trg)="b.GEN.4.17.1"> కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను . అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను .

(src)="b.GEN.4.18.1"> Hénoc engendra Irad , Irad engendra Mehujaël , Mehujaël engendra Metuschaël , et Metuschaël engendra Lémec .
(trg)="b.GEN.4.18.1"> హనోకుకు ఈరాదు పుట్టెను . ఈరాదు మహూయాయేలును కనెను . మహూయాయేలు మతూషా యేలును కనెను . మతూషాయేలు లెమెకును కనెను .

(src)="b.GEN.4.19.1"> Lémec prit deux femmes : le nom de l`une était Ada , et le nom de l`autre Tsilla .
(trg)="b.GEN.4.19.1"> లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను ; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదానిపేరు సిల్లా .

(src)="b.GEN.4.20.1"> Ada enfanta Jabal : il fut le père de ceux qui habitent sous des tentes et près des troupeaux .
(trg)="b.GEN.4.20.1"> ఆదా యా బాలును కనెను . అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు .