# te/CJCTjWof6Vy7.xml.gz
# yor/CJCTjWof6Vy7.xml.gz


(src)="1"> నేను నవధాన్య అనే విత్తనాల సంరక్షణా కేంద్రంలో ఉన్నాను గత 25 ఏళ్ల బట్టీ మేము ఎంతో ప్రేమగా , జాగ్రత్తగా మాకు దొరికిన ప్రతి విత్తనాన్ని , గింజలనూ భద్రపరుస్తున్నాము . ఈ ప్రదేశం నాకు అత్యంత సంతోషాన్ని , ఆనందాన్ని , ఆశావాదాన్ని , శాంతిని ప్రసాదించింది . శాంతి , ఎందుకంటే ఇక్కడ ఎటువంటి విరోధము , సంఘర్షణ మరియు విభేదాలు , మొక్కల మధ్యలో కానీ , చెట్ల మధ్యలో కానీ , ప్రకృతిలో కానీ లేవు ; విత్తనాల సంరక్షణా కేంద్రం లోని విత్తనాలు మన సభ్య సమాజంలో ఉన్న అందరితో పంచుకోవడానికని ఏర్పాటు చేసినవి . ఇక్కడ ఉండటం సంతోషకరమైనది ఎందుకంటే , జీవితం సంతోషదాయకమైనది , జీవించడమే ఒక కళ మరియు సంతోషకరమైన జీవనం ఆ కళకు అనుసంధానమైనది . ఆశాజనకం , ఎందుకంటే మన ప్రస్తుత జీవన విధానం , సమయం అన్నీ కూడా ఒక మొలకెత్తిన విత్తనంలోని ప్రముఖ గుర్తులు . మన భూమిలో నిక్షిప్తమైన ఈ అనేక గుర్తులు , మన పూర్వీకుల గుర్తులు , వారి సంస్మరణలు , జీవోత్పత్తికి సంబంధించిన గుర్తులూ దాఖలాలూ అన్నీ ప్రస్తుతం చెరిపివేయడానికి , మన పూర్వీకుల విధానాలను తుడిపి వేయడానికి కొందఱు సంసిద్ధమవుతున్నారు . కొన్ని సంస్థలు గత కొన్ని ఏళ్లగా ఈ స్వార్ధ ప్రక్రియలు మన మీద ప్రయోగిస్తున్నారు , ఎందుకంటే , ఆ సంస్థల స్వలాభాల కోసం , లాబోరేటరీలోజన్యుపరంగా మార్పులకు లోనయిన విత్తనాలను అమ్ముతున్నారు . మన విత్తనాల స్వాతంత్ర్యం మరియు మన ఆహార స్వాతంత్ర్యాలను పరిరక్షింకోడానికి , మనమందరం నడుంకట్టే సమయం ఆసన్నమయింది . అందుకే ఈ పిలుపు . ముఖ్యంగా , " రెండు వారాల పోరు " అక్టోబరు 2వ తారీఖు గాంధీ జయంతి నుంచి ప్రారంభించి అక్టోబరు 16వ తారీఖు వరకు అంటే ఐక్య రాజ్య సమితి ప్రకటించిన " ప్రపంచ ఆహార దినోత్సవం " వరకు జరుగుతుంది . ప్రస్తుత పరిస్తితులలో మనం ఎక్కడ చూసినా న్యాయ రీతులు , చట్టాల పేరిట ప్రజల ఆహార మరియు విత్తనాల స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరించి , కొన్ని స్వార్ధ సంస్థలు అదుపులో పెట్టుకోవాలనే నిరంకుశ యత్నాలు ఎదురవుతున్నాయి . ఐరోపా కమీషన్ వారు కూడా స్థానికమైన విత్తన ఉపయోగానికి విరుద్ధంగా , ఇటువంటి చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు . కొలంబియాలోని రైతన్నలను నిర్దాక్షిణ్యంగా , నడివీధుల్లో కాల్చి చంపుతున్నారు . ఎందుకంటే కేవలం అమెరికా- కొలంబియాల మధ్య ఉన్న స్వేఛ్చా- వాణిజ్య ఒప్పదాన్ని పటిష్టపరుచుకోడానికే మేధాసంబంధమయిన విత్తన హక్కులు అని కూడా ప్రవేశపెట్టడం జరిగింది . కానీ కొలంబియా దేశవాసులు , విత్తనాలను వారి సామూహిక వారసత్వంగా పరిగణిస్తారు . ఆఫ్రికా ఖండంలో సద్భావమైన సార్వజనిక చట్టాలు , విత్తనవృద్ధి చేసే వారి హక్కులను , పేటెంట్ లను , తప్పనిసరిగా నమోదు చేయడం అమలులోకి తీసుకువచ్చాయి . రకరకాల స్వార్ధ చింతనలు పద్దతులతో విత్తన స్వేఛ్చా స్వాతంత్ర్యాలను హరింపజేసి , రైతన్నల స్వాతంత్ర్యాన్ని మరియు , సామాన్య ప్రజలు తమ తమ ఆహార ధాన్యాలను ఎంచుకునే స్వాతంత్ర్యాన్ని వంచించడానికి పయాసలు చేపడుతున్నారు మనం ఎటువంటి ఆహారం తింటున్నామో తెలుసుకునే హక్కు అధికారం మనకు ఉంది . అందుకే ఆహార పదార్ధాలపై వివరాలు లేబిల్సు లేక ఆహార వివరాల పట్టిక ద్వారా చట్టరీత్యా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది . కాలిఫోర్నియాలో 40 మిలియన్ల డాలర్లు ఖర్చు తో ఈ ఆహార వివరాల పట్టికను తీసుకురాకుండా కొన్ని స్వార్ధ పారిశ్రమలు ఆపారు . ప్రస్తుతం అమెరికా లోని ప్రతీ రాష్ట్రంలోని ప్రజలూ , వాషింగ్ టన్ దగ్గర నుండి హవాయి రాష్ట్రం వరకూ ఈ స్వేఛ్చా స్వాతంత్ర్యాలను అడుగుతున్నారు . వీరి ఆహారంలో ఏయే పదార్ధాలు ఉన్నాయో తెలుసుకునే హక్కుకై ఉద్యమిస్తున్నారు . ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇటువంటి ప్రాథమిక హాక్కులను ఎందుకు ఆమోదించట్లేదు ? గాంధీగారు మనకి నేర్పిన పాఠం , " ఎప్పటివరకూ మనం నిరంకుశ చట్టాలు పాటిస్తామో , అప్పటివరకూ ఈ పధకం పారుతుంది ... బానిసత్వం కూడా వర్ధిల్లుతుంది . " అని చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి . అందుకే ఆయన దక్షిణ ఆఫ్రికాలో అపార్థీడ్ చట్టాలను వ్యతిరేకించారు ; అందుకే మార్టిన్ లూథర్ కింగ్ గారు , 50 ఏళ్ల క్రితం పౌర హక్కులకై ఉద్యమించారు , భవిష్యత్తులో మనం స్వేఛ్చా జీవితాన్ని పొందాలని , వారు ఎన్నో కలలు కన్నారు , ఆ కలలను మనతో పంచుకున్నారు . వారి కలలను మనం సాకారం చేసుకుని , సకల చరాచర జీవరాసులకూ , ప్రతీ సీతాకోక చిలుకకూ , ప్రతి తేనెటీగకూ , ప్రతీ తుమ్మెదకూ , ప్రతీ వానపాముకూ , సమస్త జీవ కణాలకూ కూడా ఈ స్వేచ్చా స్వాతంత్ర్యాలు వర్తిస్తాయని గుర్తించాలి . వైవిధ్యమైన ప్రతీ పంటకూ , ప్రతీ విత్తనానికి ఈ స్వేచ్చాస్వాతంత్ర్యాలు వర్తిస్తాయి . అతి సామాన్యమైన రైతన్నల దగ్గర నుండి , చిట్టి పొట్టి చిన్నారుల వరకూ విత్తనాలను మొలకెత్తింపజేసే స్వేఛ్చా స్వాతంత్ర్యాలు ఉన్నాయి . ఆ మొలకెత్తిన విత్తనాల నుండి భావితరాల వారికి విత్తనాల వారసత్వం అందించే అధికారం కూడా ఉంది . అందుకే మా ఈ పిలుపు , ఏయే దేశాలలో ఇంటువంటి నిరంకుశ చట్టాలు ఉన్నాయో , వాటిని గుర్తించి , ఏ చట్టాలు అయితే మన ఈ విత్తన స్వేఛ్చా స్వాతంత్ర్యాలను హరిస్తూ , జీవకోటికీ , మానవాళికీ అడ్డుగా నిలుస్తున్నాయో , వాటిని గుర్తించి , గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో చూపిన బాటను అనుసరించుదాము . ఈ నిరంకుశ తత్వానికి మన అవిధేయతను తెలియచేద్దాము . పూర్వం బ్రిటిష్ వారు మనం ఉప్పు పండించుకునే స్వాతంత్ర్యాన్ని హరించి , ఏకస్వామ్యాధికారాన్ని మన మీద రుద్దడానికి యత్నించారు . గాంధీ గారూ మన సముద్రపు ఒడ్డునే ఉప్పును గుప్పిట ఉంచుకుని
(src)="2"> " మన ఉప్పును మనమే తయారు చేసుకుందాము . మనము మన అవిదేయతను తెలియచేద్దాము " అన్నారు . అన్యాయమైన చట్టాలకు మనం విధేయులై ఉండరాదు . అందుకే 2013 అక్టోబరు 2వ తారీఖున , మన విత్తన స్వేఛ్చా స్వాతంత్ర్యాలను హరించే అధర్మమైన నిరంకుశ చట్టాలను మనం వ్యతిరేకించి మన ధార్మిక హక్కైన విత్తన స్వాతంత్ర్యాలను కాపాడుకుందాము . అక్టోబర్ 16వ తారీఖు ప్రపంచ ఆహార దినోత్సవం . అక్టోబర్ 12వ తారీఖున మరలా మనము అందరమూ కలిసి . " మొన్సాన్టో వ్యతిరేక ఊరేగింపు " ఉద్యమంగా మొన్సాన్టో వంటి స్వార్ధ పరిశ్రమలున్న ప్రదేశాల ద్వారాల వద్దకు తీసుకెళ్ళి ,
(src)="3"> " మీరు నిరంకుశత్వాన్ని కొనుక్కోగలరేమో , మీరు మీ తెలివితేటలతో ప్రతి పరిశోధకుడినీ మరియు ఉద్యమకారుడినీ మీ అవినీతితో తరిమివేయవచ్చు , కానీ మమ్మల్ని మాత్రం మీరు భయభ్రాంతులను చెయ్యలేరు . మేము మోన్శాంటో నిరంకుశత్వాన్ని , దానికి వత్తాసు పలికే చట్టాలను రానీయము . మా ఆహార పదార్థాల పై జన్యుపరమైన మార్పులు చేసేందుకు , మా వ్యవసాయ పద్దతులను మార్చేందుకు , మా ఆహారాన్ని మార్చేందుకు మీకు అనుమతి ఇవ్వము . " అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా , మోన్శాంటో " ప్రపంచ ఆహార పురస్కారాన్ని " ప్రపంచంలోని ఆకలిని హరించామంటూ , ఈ పురస్కారాన్ని తమకు తామే ఇచ్చేసుకుంటున్నారు . ప్రపంచంలో 72 % శాతం ఆహారం చిన్న సన్నకారు రైతన్నల ద్వారా ఉత్పత్తి అవుతుంది . ఈ పురస్కారానికి అసలైన అర్హులు మన రైతన్నలు , మన ఉద్యానవనాలను సంరక్షించే తోటమాలులూనూ , మన అమ్మలూ , మన అమ్మమ్మలూ , నానమ్మలూ , మన పరిసరాల్లో ఉన్న వంటవారూ , మన రైతులూ , మన రైతు బజారు సోదరులూనూ మన అన్నదాతలు . మనమందరమూ కలిసి అక్టోబర్ 16వ తారీఖున వీరిని సన్మానిద్దాము . అందరం కలిసి వైవిధ్యమైన మన ప్రకృతిని , ప్రకృతి నుంచి వచ్చే బహుమతులనూ ఆస్వాదించుదాము . ఎవరైతే మనకు స్వచ్చమైన , ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పండిస్తున్నారో , మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఆహార ఉత్పత్తులను జన జీవనాళికి అందిస్తున్నారో , వారందరితో కలిసి మన ఆహార స్వాతంత్ర్యాన్ని ఒక పండగలాగ జరుపుకుందాం . అందరం కలిసి మన ఆహార సంరక్షణకై , ఎన్ని పెద్ద పరిశ్రమలు ఎదురొచ్చిన్నా , మన విత్తన సంపదను రక్షించుకుందాము . మన ఈ స్వేచ్చను ఎవరికీ దాసోహం చెయ్యకుండా కాపాడుకుందాము . మనమందరమూ సమైక్యంగా మానవాళికి అండగా నిలుద్దాము . మనలోని ప్రతి ఒక్కరూ చైతన్యవంతులమై " నేను సైతం " అంటూ కలిసికట్టుగా , మన సమైక్యంగా ప్రమాణబద్దులమై , ఆహార మరియు విత్తన స్వాతంత్ర్యాలను సంరక్షించుకుందాము . సమైక్యంగా ఉంటేనే మనము ఎన్ని దుష్టశక్తులను కానీ , నిరంకుశ పరిశ్రమలను కానీ , అటువంటి పాలనావర్గాలను కానీ ఎదుర్కొనగలము . రండి , మనము అందరం కలిసి అక్టోబర్ 2 నుండి 16వ తారీఖు వరకూ , మన ఆహార మరియు విత్తనాల భద్రతకై ఉద్యమిద్దాము .
(trg)="1"> xxxxx